Kalyan-Ramవాళ్ల నాన్న హరికృష్ణ అలిగి దూరంగా ఉన్నా, కొడుకు కళ్యాణ్ రామ్ మాత్రం తాను తెలుగుదేశం అధినేతకు దగ్గరగా ఉన్నానని చాలాసార్లు  స్పఫ్టం చేశాడు. వస్తున్నా యాత్రలో  ఉండగా చంద్రబాబును కలిసి పరామర్శించడం గాని, ఆ తర్వాత టిడిపి కి అనుకూలంగా మాట్లాడటం గానీ చాలా సార్లు చేశాడు.

తాజాగా రాజకీయాల్లోకి వస్తానని, అవసరమైనప్పుడు తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడతానని తిరుమల వెళ్లిన సందర్భంగా అంటున్నాడు. రాజకీయాల్లోకి రావడమైతే ఖాయమంటున్న కళ్యాణ్ రామ్ చాలా స్పష్టంగా తెలుగుదేశంతోనే ప్రజలకు మేలు అని కూడా చెప్పాడు. చంద్రబాబు ఈ వయసులో అంత పెద్ద యాత్ర చేపట్టడం సాహసోపతమేనని కూడా అంటున్నాడు. తాత పెట్టిన పార్టీ కోసం తామంతా నిలబడతామని కూడా స్సష్టం చేశాడు.

ఒకపక్క తండ్రి బెట్టుచేస్తున్నా, మరో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ అంటీముట్టనట్టుగా ఉంటున్నా, కళ్యాణ్ రామ్ మాత్రం చంద్రబాబుని అంటిపెట్టుకునే ఉండటం విశేషం.

ఇక ఫోన్ చేసి చంద్రబాబు బుజ్జగిస్తాడేమో అనుకున్న హరికృష్ణకు ఆశాభంగమే అయింది. వస్తున్నా మీ కోసం ముగింపు సభకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తాడని ఆశించిన హరికృష్టకు బాబు నిరాశే మిగిల్చాడు. అలిగిన వాళ్లను  దూరంగా పెట్టడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.