సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద మంత్రి మాణిక్యవరప్రసాద్ విరుచుకుపడ్డారు. కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యవాదాన్ని బలంగా వినిపించడాన్ని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వద్ద భజన బృందం చేరి ఆయనను చెడగొడుతోందని ఆగ్రహించారు. “కిరణ్ కుమార్ రెడ్డి చేసిన చాలా పనులు మాకూ నచ్చలేదు. అయినా, మేం ఆయన నిర్ణయాలని గౌరవించాం,” అని చెప్పారు.
సిఎం అధిష్టానాన్ని బహిరంగంగా విమర్శించడం తగదని మాణిక్యవరప్రసాద్ అన్నారు. సిడబ్య్లూసి నిర్ణయాన్ని ప్రశ్చిండచం మంచి సంప్రదాయం కాదన్నారు. తనకిష్టం లేని డి ఎల్ రవీంద్రారెడ్డి, శంకరరావులను ఏకపక్షంగా మంత్రి పదవుల నుంచి కిరణ్ తొలగించారని కిరణ్ వైఖరిని తప్పుబట్టారు.
సిఎం కిరణ్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న గేమ్ ప్లాన్ లో తొలి అంకంగా డొక్కా ప్రెస్ మీట్ ఉన్నదని విశ్వసనీయ వర్గాల భోగట్టా!