TV9 చానెల్ ఫిబ్రవరి 1న సుప్రీం కోర్టు తరఫున అమరావతి మీద తీర్పు వెలువరించింది. అవును. సుప్రీం కోర్టులో అటు అమరావతి రైతుల, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పలు పిటిషన్లు విచారణలో ఉండగానే, రాజధానిని ఎక్కడైనా పెట్టుకునే అధికారం రాష్ట్రానికి ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు వార్త ఇచ్చింది.

ఈ ఫేక్ న్యూస్ ప్రసారం మీద న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు వార్త ప్రసారం చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించనందుకు ఆ చానెల్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఆయన కోరారు.

అమరావతి లాంటి సున్నితమైన అంశం మీద సుప్రీం కోర్టు తీర్పు అంటూ ఒక ప్రధాన టెలివిజన్ చానెల్ తప్పుడు స్క్రోలింగులు ఇవ్వడం ఉద్దేశపూర్వకం అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. వైసిపి ప్రభుత్వానికి అనుకూల వార్తాకథనాలను టివి9 ప్రతిరోజూ వండివారుస్తోందనేది జగద్విదితం.  రాజధానిని మారుస్తున్నామని వైసిపి ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపధ్యంలో, వారి వాదనకు బలం చేకూర్చటానికి ఈ రకమైన ఫేక్ న్యూస్ ని ప్రసారం చేసినట్టు భావించాలి.

దీనిమీద ఇప్పుడు సుప్రీం కోర్టు ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.

Lr to CJ Supreme Court – 10th February 2022