టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాదు మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది.

ఈ శుభకార్యానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు విచ్చేశారు. తమ ఇంట జరుగుతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ తదితరులు విచ్చేశారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. అయితే ఏడాది నుంచే మీడియాలో వీరి లవ్ అఫైర్ ప్రముఖంగా కనిపించడం మొదలైంది.  అంతరిక్షం అనే చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటించారు.

లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ (అయోధ్య) లో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో.  ఆమె తండ్రి లాయర్ కాగా, తల్లి రిటైర్డ్ టీచర్. 2012లో అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు.