కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఆరుగురు కొలువుదీరనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అందుకు ముహుర్తం ఖరారైంది. రాజ్ భవన్ లో ఈ కొత్త అమాత్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే రెండో సారి జరుగుతున్న విస్తరణలోనూ మహిళలకు మాత్రం స్థానం దక్కలేదు.
అయితే మంత్రి పదవులపై ఎక్కువ మంది ఆశ పెట్టుకోవడంతో వారిని సీఎంతో సహ సీనియర్ నేతలు బుజ్జగించారు. ఓపికతో ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. చీఫ్ విప్ పదవిని నిరాకరించిన కొప్పుల ఈశ్వర్ తో సీఎం మాట్లాడిన తర్వాత శాంతించారు. ఆరు నెలల్లోపు తగిన ప్రాధాన్యమిస్తానని హమీ ఇచ్చారు. దీంతో ఆయ న కాస్త మొత్త బడ్డారు.
ఇక కొండా సురేఖ సైతం మంత్రి పదవి ఆశించారు. సీనియర్ నేత కేకే తో కలిసి సీఎం కేసీఆర్ సచివాలయానికి పిలిచి ఆమేకు నచ్చజెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇక మంత్రులుగా అవకాశం దక్కని వారికి, సీనియర్లకు నామినేటెట్ పదవులు కట్టబెడుతున్నారు. సీఎం సన్నిహితుడైనా మహబుబ్ నగర్ జిల్లా నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్షీ, వినయ బాస్కర్, శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావు లకు పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించారు. మరో ఇద్దరికి సైతం ఇదే బాధ్యతలు అప్పగించనున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదా ఉన్న కార్పోరేషన్లనకు చైర్మన్లుగా నియమించాలని నిర్ణయించారు.