హీరో శర్వానంద్ (Sharwanand) పెళ్లికొడుకు అవుతున్నాడు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకలో శర్వానంద్ ప్రాణ మిత్రుడు రామ్‌చరణ్ (Ram Charan), ఆయన సతీమణి ఉపాసన పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఒకే ఒక జీవితం’ సినిమా తర్వాత శర్వానంద్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్లు ఏమీ బయటకు రాలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే ఆయన కొంత విరామం తీసుకున్నారని, త్వరలోనే కొత్త సినిమాల గురించి ప్రకటిస్తారని సమాచారం.
Telugu film hero Sharwanand is soon entering wedlock. He is today engaged to Rakshita Reddy in a ceremony in Hyderabad. His close friend Ram Charan, his wife Upasana were present on the occasion.