Admin 

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల లిస్టులో రకరకాల జిమ్మిక్కులు చేయాలని అధికార వైసిపి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవల్ని అధికారికంగా, అనధికారికంగా వాడుతోంది. చివరికి పోలీసులను కూడా దించి, దొంగ ఓట్లని చేర్పించడంలో, ఉన్న ఓట్లని తొలగించడంలో వారిని వినియోగిస్తోందని కూడా ఆరోపణలు వచ్చాయి.  దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మీద ఉరవకొండలో అధికారుల మీద, పర్చూరులో పోలీసుల మీద ఎన్నికల సంఘం చర్యలు కూడా తీసుకొంది.

అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల్లో కొంత ఊపు తగ్గిందని, అధికార పార్టీకి కోపం రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఎన్నికల సంఘంలో పనిచేసే ఒక సీనియర్ అధికారి మీద ఏపి సిఐడి ద్వారా బెదిరింపులకి పాల్పడి, తమ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. 

ఇందుకోసం, ఈ మధ్య టిడిపి అధినేత చంద్రబాబు నాయడి మీద పెట్టిన మద్యం కేసుని వాడుకొంటున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో ఇప్పుడు ఎన్నికల సంఘంలో ఉన్న అధికారి ఎక్సైజు డిపార్టుమెంటులో పనిచేశారు కాబట్టి, కావాలంటే ఆ కేసులో ఆయన్ని కూడా ఇరికించగలం అని, సిఐడి చేత విచారణ పేరుతో వేధించగలం అని బెదిరించినట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

దీన్నిబట్టి, ఈ సారి ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము కాబోతోంది. వైసిపి ఎంతకైనా తెగించి, ఎన్నికల ప్రక్రియని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి పోలీసు యత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకోవటం ఇప్పటికే మొదలుపెట్టిందని టిడిపి నాయకులు అంటున్నారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం వారో, లేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమో తలుచుకుంటే తప్ప, ఆంధ్రలో వైసిపి ఆగడాలని అరికట్టడం సాధ్యం కాదనేది పరిశీలకుల అభిప్రాయం.