Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu has appointed industrialist Grandhi Mallikarjuna Rao as the chairman for AP Skill Development Corporation.
During the meeting, the Chief Minister was given a presentation on skill development plan in the state. The Chief Minister said that Mr Rao has the capability of changing the face of the state in skill upgradation.
The budget allocated for the skill development program in the state is Rs700 crore. In 10 years, the Chief Minister said, about 2 crore people will be part of the government’s skill development program. At the end of the training session, these people will receive certificates.
Training will be held in various sectors including mapping, construction, manufacturing, etc. At the mandal-level, training will be given in agriculture and allied activities while at the district-level training will be given in garment-making, plumbing, etc. Similarly, at the regional (Rayalaseema, North Coastal Andhra, Central Andhra) level, training will be given in computer/software courses, healthcare and energy sector.
For Coastal Andhra, the Chief Minister suggested that people from the region be trained in marine, Naval and shipping-related industries.
By 2016, skill development centres will be operational and the Skill Development Corporation will be officialy launched before January 15th, 2015, the Chief Minister said.
Chief Secretary IYR Krishna Rao, APSDC chairman Grandhi Mallikarjuna Rao, advisor K. Lakshminarayana, CEO Ganta Subbarao, principal secretary Satish Chandra and secretary to CM Sair Prasad were present at the meeting.
Telugu Press Note:
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రెండుకోట్ల మందికి శిక్షణ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చగలరన్న నమ్మకంతోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పారిశ్రామిక దిగ్గజం శ్రీ గ్రంధి మల్లికార్జునరావు నియమించామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక తన లక్ష్యాలను, ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు.
జీఎమ్మార్ తో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు, అధికారులు ఏపీఎస్ఎస్ డీసీ కోసం నియమించామని, వీరంతా ఆంధ్రప్రదేశ్ దశను మార్చడానికి గట్టి ప్రయత్నం చేయగలరన్న నమ్మకంతో వున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, దీన్ని మూడు దశల్లో చేస్తామని సీయం చెప్పారు. డ్రాప్ అవుట్స్, నిరక్షరాస్యులు, స్కిల్ కోర్సులు చేసిన వారు.. ఇలా మూడు రకాల వారికి అవసరమయ్యే శిక్షణ ఈ కార్పొరేషన్ ద్వారా అందుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
700కోట్ల రూపాయిలతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందని కూడా చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో స్కిల్ వర్కర్ల అవసరం ఎంతో వుందన్న ముఖ్యమంత్రి, సత్వరం కార్పొరేషన్ కార్యకలాపాల్ని ప్రారంభించాలని సూచించారు. త్వరలో కార్పొరేషన్ ను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఒక అధికారిని డిప్యూటీ సీఈవోగా నియమిస్తామని చెప్పారు. టెక్స్ టైల్ రంగంలో నిపుణులైన పనివారి అవసరం చాలా వుందని సీయం తెలిపారు.
వచ్చే పదేళ్లలో ఈ కార్పొరేషన్ ద్వారా 2కోట్ల మందికి కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. మండలస్థాయిలో వ్యవసాయ ఆధారిత రంగంలో శిక్షణ ఇస్తారని, జిల్లాస్థాయిలో గార్మెంట్ మేకింగ్, ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు వంటి వృత్తి నిపుణులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. రీజియన్ లెవల్లో హెల్త్ కేర్, ఎనర్జీ, ఐటీ కోర్సులలో శిక్షణ ఇస్తారని వివరించారు. తీరం వెంబడి పోర్టులను అభివృద్ధి చేస్తున్నందున షిప్పింగ్ తదితర కార్యకలాపాల్లో కూడా నైపుణ్య శిక్షణ అవసరమని సీయం అభిప్రాయపడ్డారు.
అలాగే అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నందున ఆరంగంలో కూడా శిక్షణ అవసరమని అధికారులకు సూచించారు. శిక్షణ తదనంతరం ధృవీకరణ పత్రాల్ని అందజేయాలన్నారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ప్రొడక్టివిటీ పెరడగడమే కాకుండా పనిచేసే సామర్ధ్యం కూడా పెరగాలన్నారు. 2016నాటికి రాష్ట్రవ్యాప్తంగా వంద స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ప్రారంభమవుతాయని, అందులో మూడు మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీయం అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ గ్రంధి మల్లికార్జునరావు, ఛీఫ్ సెక్రటరీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు, స్కిల్ డెవలప్ మెంట్ అడ్వైజర్ శ్రీ లక్ష్మీనారాయణ, సీఈవో శ్రీ గంటా సుబ్బారావు పాల్గొన్నారు.