కిరణ్ క్యాబినెట్ లో పదిమంది సీమాంధ్ర మంత్రులు అప్రూవర్లుగా మారడానికి సిద్దంగా ఉన్నారా? తమకు కొన్ని గ్యారంటీలు ఇస్తే, రాష్ట్ర్ర విభజన అంశం మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలా చెబితే అలా వ్యవహరించేందుకు రెడీ అంటున్నారా?
తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. సిఎం కిరణ్ తో సంబంధం లేకుండా, ఆనం రామనారాయణరెడ్డి తదితర మంత్రులు నిన్న సమావేశం కావడం, అందులో అధిష్టానం మనసెరిగి ప్రవర్తించాలని, కిరణ్ లాగా దూకుడు తగదని నిర్ణయించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నిర్నయం మారే అవకాశం లేదని, అవసరమైతే కిరణ్ ను పక్కన బెట్టి వ్యవహారం చేస్తారని చిరంజీవి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యం, కాంగ్రెస్ నాయకత్వానికి కోపం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ మీద ఒక క్లారిటి ఇస్తే, అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటామని ఈ మంత్రులు చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర్ర విభజన అంశం మీద సిడబ్ల్యూసి నిర్ణయాన్ని పదే పదే విమర్శించిన కిరణ్ కు చెక్ పెట్టాలనే కాంగ్రెస్ బాస్ ల వ్యూహంలో భాగంగానే తాజా పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయని కూడా అంటున్నారు.
ఈ నేపధ్యంలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడా, సమైక్యాంధ్రకు ఏకైక చాంపియన్ గా జగన్ మాత్రమే బరిలో నిలుస్తాడా అనేది చూడాల్సి ఉంది.