Admin

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని, రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని గురించిన వివరాలు వాలంటీర్ల వ్యవస్థ కారణంగా గోప్యత లేకుండా పోవడం వల్లనే ఈ పరిణామం జరుగుతోందని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

దీని మీద రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు విరుచుకుపడ్డారు. 

అయితే ఇప్పుడు జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళలు అదృశ్యమైన మాట వాస్తవమేనని పార్లమెంటులో హోంశాఖ తెలిపింది. 

2019-2021 మధ్యకాలంలో ఏటేటా ఇలా అదృశ్యమవుతున్న బాలికలు, మహళల సంఖ్య పెరుగుతూ వచ్చిందని ఈ లెక్కలు తెలుపుతున్నాయి. 

ఈ లెక్కల ప్రకారం, మూడు ఏళ్లలో ఏపీ లో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు అదృశ్యమయ్యారు.

2019లో ఏపీ నుండి 2186 బాలికలు, 6252 మహిళల మిస్సింగ్ కేసులు 

2020 లో ఏపీ నుండి 2374 బాలికలు, 7057 మంది మహిళల మిస్సింగ్ కేసులు

2021 లో ఏపీ నుండి 3358 బాలికలు, 8969 మంది మహిళల మిస్సింగ్ కేసులు

దీనికి అధికార వైసిపి నాయకులు ఏం సమాధానం చెబుతారని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో ప్రశ్నించారు.