మార్గదర్శి మీద దాడి విషయంలో ఒక ఫ్యాక్షన్ లీడర్ స్వభావాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు. చట్టాల్ని, వ్యవస్థల్ని బానిసలుగా చేసుకొని, ముప్పేట దాడి చేసి మార్గదర్శి వ్యాపారాన్ని స్థంభింపజేయాలనేది జగన్ కోరిక. ఎన్ని అరాచకాలకి పాల్పడ్డా మార్గదర్శి తట్టుకొని నిలబడే ఉంది.

దీంతో అసలు చందదారులని బెదిరిస్తే తప్ప, మార్గదర్శి వ్యాపారం ఆగేలాగా లేదని జగన్ భావించాడు.  ఫలితంగా ఇవాళ అన్ని పత్రికల్లో మార్గదర్శి చందాదారులకి నోటీసు పేరుతో చందాదారుల్ని భయపెట్టి, బెదిరించే ప్రయత్నాన్ని చేశాడు. ప్రజాధనాన్ని ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్న వాళ్ల మీద బురదజల్లడంలో జగన్ ఆరితేరాడని మరోసారి రుజువైంది.

ఈ ప్రకటనకి వెంటనే మార్గదర్శి స్పందించింది. అందులో ప్రస్తావించిన ప్రతి ఆరోపణని వివరణాత్మకంగా ఖండించింది. ప్రెస్ నోట్ పూర్తి పాఠాన్ని కింద చూడవచ్చు. ఇందులో కొన్ని ముఖ్య అంశాలివి:

ఖాళీ టికెట్స్ కి మార్గదర్శి డబ్బు కట్టడం లేదు. ఖాతాదారుల డబ్బునే ఇందుకు వాడుతున్నారు.

ఖాళీ టికెట్స్ కట్టడానికి మార్గదర్శికి బ్యాంకులో ఉన్న అదనపు నిధులనే ఉపయోగిస్తారు. మార్గదర్శి అకౌంట్ లో రు.1,500 కోట్ల రూపాయలు మిగులు నిధులు ఉన్నాయి. ఖాళీ చిట్ల పద్దులని ప్రతినెలా అకౌంట్లలో రాస్తారు. సొంత నిధులనే మార్గదర్శి ఇందుకు ఉపయోగిస్తోంది.

పాడుకున్నప్పుడు, వేరే చందాదారుల డబ్బుని వాడి, పాడినవారికి కడుతున్నారు.

మార్గదర్శి ఖాతాల్లో తగినన్ని నిధులు ఉన్నాయి. వేరే ఖాతాదారుల చిట్ల డబ్బుని వాడాల్సిన అవసరం లేదు. అందువల్ల నగదు కొరత కాలంగా చెల్లింపుల్లో ఆలస్యం జరిగిందనే ప్రసక్తి రాదు.

చిట్ పాడుకున్నవారికి 4 నెలలకి పైగా పైకం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు.

చిట్ పాడుకున్న ఖాతాదారుల్ని సెక్యూరిటి సమర్పించమని అడిగే హక్కు ఫోర్ మన్ కు ఉంటుంది. చీటీ పాడుకున్న చందాదారుకి తగిన సెక్యూరిటి సమర్పించిన మరుక్షణం డబ్బు చెల్లిస్తున్నారు.

చిట్ గ్రూప్ ప్రారంభించే ముందే చందాలు వసూలు చేస్తున్నారు.

శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే కంపెనీ చందాలని వసూలు చేస్తోంది. చందాదారు ముందస్తుగానే చందా చెల్లించే సౌకర్యం చట్టంలోనే ఉంది. అయినా ప్రారంభానికి ముందే చందా స్వీకరించకూడదని చట్టంలో ఎక్కడా లేదు.

సెక్యూరిటి పేరుతో పాడిన మొత్తాన్ని చందాదారుకి చెల్లించకుండా డిపాజిట్ గా ఉంచుకుంటున్నారు.

చందాదారుల ప్రయోజనాల కోసం సెక్యూరిటిని క్షుణ్నంగా పరిశీలించాలి. సెక్యూరిటి లేనప్పుడు, భవిష్యత్తులో ఇంకా చెల్లించాల్సిన వాయిదాల సొమ్ముకి సెక్యూరిటిగా ఫోర్ మన్ స్వీకరించవచ్చని చట్టం చెబుతోంది. ఈ మొత్తాలు డిపాజిట్ల కిందకు రావు. 

మార్గదర్శి కౌంటర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Margadarsi Counter

మార్గదర్శి అక్రమాల పుట్ట అని, ఖాతాదారుల డబ్బుని సొంతానికి వాడుకుంటున్నారని, కంపెనీ దివాలా తీసి చందాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టబోతోందని స్వయంగా ఏపి ప్రభుత్వ రిజిస్ట్రార్, సిఐడి చీఫ్ లు చెప్పినా జనం నమ్మడం లేదు. మార్గదర్శి వ్యాపారం స్తంభించడం లేదు. అందుకే చివరగా పత్రికల నిండా నోటీసు పేరుతో ఈ బెదిరింపులకి పాల్పడ్డారు. 

వచ్చే ఎన్నికల వరకు, ఈ అరాచకం ఇలాగే కొనసాగుతుంది.