వివేకా కేసులో ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతున్నాడని మరోసారి రుజువైంది.
హత్య జరిగిన రోజు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తన లోటస్ పాండ్ ఇంట్లో ఎన్నికలకి సంబంధించి ఒక మీటింగు పెట్టారు. అందులో అజయ్ కల్లాం, దువ్యూరి కృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారట. ఈ సమావేశం 2019 మార్చి 15 వేకువ జామున జరిగింది. సమావేశం మొదలుకాగానే, ఫోన్ వచ్చిందని జగన్ ఇంట్లో పైకెళ్లాడట. వెనక్కి వచ్చి, బాబాయి గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడట.
ఈ విషయాలన్నీ సిబిఐ ఇంటర్వ్యూలో అజయ కల్లాం చెప్పాడని ఆంధ్రజ్యోతి కథనం.
ఇదే నిజమైతే, వివేకా హత్యకి సంబంధించి జగన్ పాత్ర మీద మరిన్ని అనుమానాలు రాక మానవు. వివేకాది హత్య అని బయటి ప్రపంచానికి తెలిసిందే ఉదయం 6 గంటల తర్వాత. మరి జగన్ కి మాత్రం అంతకు గంటముందే చెప్పిందెవరు?
అంటే వివేకా హత్య గురించి జగన్ కి ముందే తెలుసా?
వివేకానందరెడ్డి హత్య కేసుని నీరుకార్చాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తే, ఆ కేసు వాళ్లకి అంత జటిలమవుతోంది. ఈ కేసులో జగన్ తొలి నుంచి చెబుతున్న అబద్ధాలు పేరుకుపోతున్నాయి. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నలివి
వివేకాది హత్య అని తెలిసీ, జగన్ ఆ తర్వాత గుండెపోటు అని ఎందుకు చెప్పాడు?
అంటే తమ వాళ్లే చేశారు అని తెలుసన్న మాట.
వాళ్లని రక్షించడం కోసం అబద్ధం చెప్పాడా?
మరి చంద్రబాబు మీద నెపం ఎందుకు నెట్టాడు?
అలాగే సిబిఐ విచారణ కావాలి అని నాటకం ఎందుకు ఆడాడు?
దృష్టి మళ్లించడానికా?
అధికారంలోకి వచ్చాక, దర్యాప్తుని ఎందుకు నీరుగార్చాడు?
ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు రెండు సార్లు సిట్ ని మార్చాడు?
చివరగా వేసిన సిట్ ఎందుకని దర్యాప్తులో అడుగు కూడా ముందుకు వేయలేదు?
ఎందుకు ఆయన ప్రభుత్వం కేసుని అలా వదిలేసింది?
చివరికి, సునీత పూనుకోవడంతో డొంక కదలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
దోషులని కనుక్కోవాలని అన్నందుకు సునీత మీద జగన్ కి ఎందుకు కోపం వచ్చింది?
చంపిన వాళ్లని పట్టుకోవాలని ఆమె కోర్టుకి ఎందుకు వెళ్లవలసి వచ్చింది?
అంతకుముందు సిబిఐ విచారణ కావాలన్న జగన్, ఆ తర్వాత వద్దని కోర్టులో ఎందుకు అన్నారు?
సుప్రీం కోర్టు సిబిఐకి కేసుని అప్పగిస్తే, ఎందుకు సహకరించలేదు?
కోర్టులో పోరాడి సునీత కేసుని హైదరాబాద్ కి ఎందుకు మార్పించాల్సి వచ్చింది?
ఆ తర్వాత కూడా జగన్, ఆయన అనూయాయులు అనుమానితులకి ఎందుకు సపోర్టుగా ఉన్నారు?
సునీత మీద ఎందుకు అడ్డమైన రాతలు సాక్షిలో రాయించారు?
ఇప్పటికీ అవినాష్ రెడ్డికి మద్దతుగా జగన్ ఢిల్లీ లో ఎందుకు మంతనాలు జరుపుతున్నారు?
ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటే, వివేకా హత్య వ్యవహారంలో జగన్ కి భాగస్వామ్యం లేదని చెప్పడం కష్టమే. ఈ కేసులో నిజాలు బయటకి రాకుండా, జగన్, ఆయన ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయినా నిజాన్ని దాచలేరు.